Review: నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీ రివ్యూ

0
107
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమే ‘కార్తికేయ 2’. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందించారు కార్తికేయ 2. ద్వారక రహస్యాన్ని చేధించే కథాంశంతో తెరెకక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయింది. మరి ఈ సినిమాతో నిఖిల్ హిట్ కొట్టాడా? హీరోకు సీక్వెల్ సక్సెస్ ను తెచ్చి పెట్టిందా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికొస్తే..

 హీరో నిఖిల్ ఓ హాస్పిటల్లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ప్రతి విషయాన్నీ సైంటిఫిక్‌గా ఆలోచించడం, మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించడం అతని నైజం. అయితే కార్తికేయ (నిఖిల్) ఒకసారి ద్వారకా వెళ్లగా అనుకోకుండా ఎదురుపడిన ఓ ఆర్కియాలజిస్ట్ అతనికి ఓ బాధ్యతను అప్పగించి చనిపోతాడు. అయితే కార్తికేయ ఆయనని చంపేశాడని అపార్థం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ కార్తికేయ వారికి చిక్కకుండా తన లక్ష్యాన్ని చేరుకోవడంపై దృష్టి పెడతాడు.

మొదటి పార్ట్ల్ లో చెప్పిన సుబ్రహ్మణ్యపురం కథతో మొదలు పెట్టి ద్వారకవైపు ప్రేక్షకుల్ని మళ్లించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మొత్తం జర్నీలో ఓ చక్కని మిస్టరీని పెట్టి, దాన్ని కనిపెట్టడానికి హీరో చేసే ప్రయత్నాలను థ్రిల్లింగ్‌గా మలచి మెప్పించాడు. మలుపులు ఆకట్టుకున్నాయి. పాత్రలు ఎంటర్‌‌టైన్ చేశాయి. దాంతో సినిమా పూర్తయ్యేవరకు ప్రేక్షకుడికి నిరాశ కలగదు.

ఎవరెలా చేశారంటే..?

కార్తికేయ పాత్రలో నిఖిల్ చక్కగా ఒదిగిపోయాడు. నటనలో ఎంతో పరిణితి కనబరిచాడు. అనుపమ కూడా ముగ్ద పాత్రను సునాయాసంగా చేసింది. ప్రత్యేక పాత్రలో మెరిసిన అనుపమ్ ఖేర్ ఉన్నది కాసేపే అయినా తన నటనతో కట్టి పడేశారు. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష ఉన్నంతలో బాగానే నవ్వించారు. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి తన కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. తులసి, ఆదిత్య మీనన్, సత్య, ప్రవీణ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, కాలభైరవ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచాయి. చందూ మొండేటి విజువలైజేషన్ కి కార్తీక్ సినిమాటోగ్రఫీ తోడై బ్యూటిఫుల్ అవుట్ పుట్ వచ్చింది. ఎడిటర్ కూడా కార్తీకే కావడం మరింత కలిసొచ్చింది. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్: 3/5