టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. దీనితో పాదయాత్రకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూరమయ్యారు. ఇప్పటికే పాద యాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం కాగా.. రేవంత్ రెడ్డి కూడా యాత్రకు పార్టీ నేతలను ఆహ్వానిస్తూ తాను కూడా సిద్ధమైపోయారు.
ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి శనివారం ఉదయం కరోనా బారిన పడ్డారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో తన ఇంటిలోనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి తాను యాత్రకు రాలేనని, అందుకు గల కారణాలను వివరిస్తూ సందేశం పంపారు. యాత్రకు రాని కారణంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సారీ కూడా చెప్పారు.