బింబిసార మూవీ చూసిన బాలయ్య..ఏమన్నాడంటే?

0
105

కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ట్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

సోషియో ఫాంటసీ కథతో తెరెకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రస్తుతం వసూళ్ల సునామి సృష్టిస్తుంది. ఇక ఈ సినిమాను హీరో నందమూరి బాలకృష్ణ.. బింబిసార చిత్రాన్ని శనివారం థియేటర్​లో వీక్షించారు. హీరో కల్యాణ్​రామ్​, దర్శకుడు వశిష్ఠ తదితరులతో కలిసి ఆయన సినిమా చూశారు. అనంతరం బింబిసార చిత్రబృందాన్ని అభినందించారు. అద్భుతమైన ప్రయత్నమంటూ ప్రశంసించారు.

మరోవైపు ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జి5 బింబిసారాను భారీ ఒప్పందానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే 50 రోజుల తర్వాతనే ఓటీటీలో రిలీజ్‌ చేస్తామని వెల్లడించారు.