రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఓ మహిళా దొంగ హల్ చల్ చేసింది. పట్టణంలోని కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఇల్లును లూటీ చేసింది ఆ కి’లేడీ’. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 57 తులాల బంగారం, 56 తులాల వెండి , 2 లక్షల 82 వేల నగదు మొత్తంగా దాదాపు 40 లక్షల సొత్తుతో ఉడాయించింది ఆ మహిళా దొంగ.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్థరాత్రి వేళ ఓ మహిళ తాళం పగులకొట్టి ఇంట్లో చొరబడినటు తెలుస్తుంది. ఆ మహిళ చోరీకి పాల్పడిన దృశ్యాలు సిసి టివి కెమెరాల్లో రికార్డ్ అయింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.