బేబీ బంప్‌తో స్టార్ హీరోయిన్..ఫొటోస్ వైరల్

0
119
Bipasha Basu

బిపాసా బస్సు మహేష్ సరసన టక్కరి దొంగ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఆ తరువాత ఏ తెలుగు సినిమాలో ఎక్కడా కూడా నటించలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం బోల్డ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. బాలీవుడ్ లో రాజ్ జిస్మ్, ధూమ్-2, రేస్ వంటి చిత్రాలలో నటించి మంచి ఘనత సాధించింది.

అయితే తాజాగా తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బస్సు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మాకు ఇది కొత్తదశ జీవితంలోకి సరికొత్త వెలుగు వచ్చింది’ అని బిపాషా పేర్కొంది. బిపాషా, కరణ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే.