ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్

0
98

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కస్తూర్బా పాఠశాల వద్ద చోటుచేసుకుంది. బొలెరో డ్రైవర్‌తో పాటు బైక్‌పై ఉన్న భార్యభర్తలు మృతిచెందారు.

అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  వివరించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలేంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.