అఫ్గానిస్థాన్ ఖైర్ ఖానా ప్రాంతంలోని ఓ మసీదులో సాయంత్రం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మసీదు ఇమామ్ సహా కనీసం 20 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని కొందరు అధికారులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరనేది ప్రస్తుతానికి తెలియరాలేదు.