కాసులు కురిపిస్తున్న కార్తికేయ- 2..ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే?

0
107

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందించారు కార్తికేయ 2. ద్వారక రహస్యాన్ని చేధించే కథాంశంతో తెరెకక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​ గా నటించింది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయింది. ఇక కార్తికేయ 2 బాక్సాఫీస్ ను రఫ్పాడిస్తోందట. రోజు రోజుకూ.. థియేటర్ల సంఖ్య పెరుగుతుండడంతో.. కలెక్షన్స్ గ్రాఫ్ పరుగెడుతోందట.

ఇక ఈ సినిమా తొలి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 7.02 కోట్లు
సీడెడ్ – 2.91 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.59 కోట్లు
ఈస్ట్ – 1.54 కోట్లు
వెస్ట్ – 1.03 కోట్లు
గుంటూరు – 1.65 కోట్లు
కృష్ణా – 1.36 కోట్లు
నెల్లూరు – 0.59 కోట్లు

ఏపీ+తెలంగాణ – 18.69 కోట్లు (రూ.29.55 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.64 కోట్లు
ఓవర్సీస్ – 3.25 కోట్లు
నార్త్ ఇండియా – 4.45 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.28.03 కోట్లు ( రూ.50.55 కోట్ల గ్రాస్)