హిమాచల్‌ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీ సమావేశాలకు తనను ఆహ్వనించడం లేదని.. అందుకే తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.