Flash news: మునుగోడు బహిరంగ సభకు చేరుకున్న అమిత్ షా

0
83

మునుగోడు బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి మునుగోడుకు ప్రత్యేక హెలికాప్టర్ లో సభకు చేరుకున్నారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్ షాకు బేగంపేట్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న మునుగోడులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాదీవెన సభలో  కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా ఎలా స్పందిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.