Birthday special: మెగాస్టార్​ కన్నా ముందు చిరంజీవిని ఏమని పిలిచేవారో తెలుసా?

0
95

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఇది కేవలం పేరు మాత్రమే కాదు బ్రాండ్. రికార్డుల రారాజు. డైలాగ్ డెలివరీలో కింగ్. మాస్ కా బాస్. క్లాస్ కా బాప్. కామెడీలో తన టైమింగే టైమింగ్. ఎన్నో మరుపురాని చిత్రాలలో నటించిన చిరు పుట్టినరోజు నేడు. ఫ్యాన్స్ ఆయనను మెగాస్టార్ గా పిలుస్తుంటారు. మరి ఆయనకు ఆ బిరుదు ఎలా వచ్చింది. అంతకుముందు ఇంకేమైనా బిరుదులున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తొలినాళ్లలో చిరంజీవి ‘సుప్రీమ్‌ హీరో’గా పేరొంది ఆ తర్వాత ‘మెగాస్టార్‌’గా విశేష క్రేజ్‌ సంపాదించుకున్నారు. 1988లో వచ్చిన ‘మరణ మృదంగం’తో చిరంజీవి.. మెగాస్టార్‌గా మారారు. ఆ చిత్ర నిర్మాణ కె. ఎస్‌. రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. అంతకు ముందు వరకూ ఆయన నటించిన సినిమా టైటిల్స్‌లో కొన్నింటిలో చిరంజీవి అని, మరికొన్ని చిత్రాల్లో సుప్రీమ్‌ హీరో అని కనిపిస్తుంది.

చిరు ‘సుప్రీమ్‌ హీరో’గా కనిపించిన చివరి చిత్రం ‘ఖైదీ నంబరు. 786’. సుప్రీమ్‌ హీరో, మెగాస్టార్‌.. ఈ రెండింటిపైనా పాటలు రావటం విశేషం. డేరింగ్, డాషింగ్ డైనమిక్, నట కిషోర్, రోరింగ్ లయన్, ఘరానా చిరంజీవి, నట విజేత అని చిరంజీవి సంబోధించేవారు. ఇప్పుడు మెగాస్టార్​తో పాటు గాడ్ ఫాదర్ అని కూడా సంభోదిస్తున్నారు.