సామాన్యుడి నుండి మెగాస్టార్ గా..చిరు ప్రస్థానం ఎలా సాగిందంటే..

0
117
Ram charan upasana

మెగాస్టార్ చిరంజీవి. ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఎన్నో మరపురాని చిత్రాలలో నటించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ కే మెగాస్టార్ గా మారారు. అయితే సామాన్యుడి నుండి స్టార్ గా ఎదగడం అంటే మాటలు కాదు. ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో అడ్డంకులు ఇవన్నీ దాటుకుంటూ నేడు అందరికి పెద్దన్నగా మారారు. మరి ఆయన ప్రస్థానం గురించి ఇప్పుడు ఓ లుక్కేద్దాం..

1955 ఆగస్ట్ 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూర్ గ్రామంలో కొణిదెల వెంకట్రావ్, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు చిరంజీవి. అయితే నటనపై ఉన్న మక్కువతో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే పరిశ్రమలోకి అడుగుపెట్టి ముందు ముందు చిన్న చిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత ప్రతి నాయకుడిగా మెప్పించి.. హీరోగా అవకాశాలు అందుకున్నారు.

1978లో పునాది రాళ్లు చిత్రంతో ఆయన నటజీవితం ప్రారంభమైంది. కానీ ఈ సినిమా కంటే ముందే ప్రాణం ఖరీదు మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన స్వయం కృషి చిత్రం ఆయన కెరీర్‏ను మలుపు తిప్పింది. శుభలేఖ, ఖైదీ, సంఘర్షణ, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, కొండవీటి రాజా, రాక్షసుడు, రుద్రవీణ, చంటబ్బాయి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన రుద్రవీణలోని నమ్మకు నమ్మకు ఈరేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని అనే పాట చిరుకు ఆల్ టైమ్ ఫెవరేట్.

అలాగే 1992లో వచ్చిన అపద్భాంధవుడు సినిమాకు మొదటిసారి అత్యధిక పారితోషికం తీసుకున్నాడు. దాదాపు రూ. 1.25 కోట్లు తీసుకున్నాడట. ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు 1998లో అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు. ఆ తర్వాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ట్రస్టులను ప్రారంభించారు. ఇక 2008 ఆగస్ట్ 26న స్వయంగా ప్రజారాజ్యం అనే పార్టీని ఆవిష్కరించి రాజకీయ ప్రవేశం చేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటి చేయగా 18 స్థానాలను గెలిచింది.

చిరు ప్రస్థానం మరువలేనిది..మరిచిపోలేనిది..