హిందువులు నవరాత్రుల ఉత్సవాలను ఎందుకు జరుపుకుంటారో తెలుసా

హిందువులు నవరాత్రుల ఉత్సవాలను ఎందుకు జరుపుకుంటారో తెలుసా

0
144

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతీ హిందువు దసరా పండుగ ముందు తొమ్మిదిరోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారు… తొమ్మిదిరోజులు రాత్రి తొమ్మిది రోజులు పగలు నిత్యం దుర్గాదేవిని పూజిస్తూ దీవేనలు అందుకుంటారు. అంటే ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వరకు తొమ్మిది రాత్రులను నవరాత్రులు అయిన వ్యవహరిస్తారు.

కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతోకూడ అడవులు తిరుగుచు కష్టాలను అనుభవిస్తుంటాడు ఆ సమయంలో అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజాలు చేయమని కోరుతాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి తిరిగి తన ఐశ్వర్యమును పొందారని అంటారు.

ప్రజలు దుర్గ లక్ష్మి సరస్వతి వీరిలో ఒక్కొక్కదేవిని మూడేసి రోజులు పూజిస్తారు. ఈ తొమ్మిది రాత్రులు ఆ దేవతలను పూజించేందుకు వీలుకాకపోవడంతో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధిప్రకారము పూజిస్తారు. అలా పూజించిన రోజును మహానవమి సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతి పూజాదినము అని, ఆయుధములను పెట్టి పూజంచుటచే ఆయుధపూజాదినము చెప్పబడును. ఆ మరుసటి రోజు దశమి తిథికి విజయదశమి అని పేరు.