ఏపీ టెన్త్ పరీక్షల్లో కీలక సంస్కరణలు చేపట్టింది ప్రభుత్వం. ఇకపై పబ్లిక్ పరీక్షల్లో ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకె కొత్త విధానమని తీసుకొస్తున్నామని తెలిపారు.
ఏడాది పొడవునా వివిధ పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థుల్లో ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో 11 పరీక్షలు అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు 2024-25 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ బోర్డుతో కలిపి పరీక్షలు నిర్వహించనున్నారు.
గతంలో 11 పేపర్లు నిర్వహించగా కోవిడ్ కారణంగా వాటిని 7 పేపర్లకు కుదించారు. ఇక తాజాగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే పెట్టనున్నారు. ఫిజికల్ సైన్స్,బయలాజికల్ సైన్స్ కు కలిపి ఒకే పేపర్ కాగా సీబీఎస్ ఈ తరహాలో పరీక్షలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు.