గన్ తో బెదిరించి కారులో అత్యాచారం..సీఐ ఘాతుకం

0
130

అతనో పోలీస్. తప్పు చేసే నిందితులను కటకటాలలో వేసే డ్యూటీ అతనిది. రోజుకు ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులతో స్టేషన్ కు వస్తుంటారు. అలాగే ఎన్నో నేరాలు చేసే నిందితులను పట్టుకుంటారు. కానీ ఓ నిందితుడి భార్యపై పోలీస్ కన్నుపడింది. దీనితో ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని మారేడుపల్లి ఠాణా మాజీ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ)
కోరట్ల నాగేశ్వరరావు అత్యాచారం చేశాడని వనస్థలిపురం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితురాలి భర్తపై ఉన్న కేసులు ట్రయల్‌కు రానున్నాయని దీన్ని ఆసరాగా చేసుకొని ఆమెను లోబరుచుకోవాలని సీఐ భావించాడు.

అయితే బాధితురాలితో తనకు వివాహేతర సంబంధం ఉందని కస్టడీ సమయంలో పలుమార్లు బుకాయించిన మాజీ సీఐ నాగేశ్వర రావును లైంగిక సామర్థ్య (పొటెన్సీ) పరీక్షలు నిర్వహించగా అందులో వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో పాటూ మేజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మహిళా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (ఎస్పీ) స్థాయి అధికారిణి రికార్డు చేశారు.

నిందితుడు బాధితురాలి కణతపై తుపాకీ పెట్టి అత్యాచారం చేశాడని, తగిన ఆధారాలతో సహా తుది నివేదిక సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న పలువురి స్టేట్‌మెంట్లను రికార్డు చేసి, సాధ్యమైనంత త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు వనస్థలిపురం పోలీసులు కసరత్తు చేస్తున్నారు.