శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల ఆరోజే..టీటీడీ ప్రకటన

0
97

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబ‌రు నెల‌ కోటాను ఆగ‌స్టు 24వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.  అదేవిధంగా, అక్టోబ‌రు నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఆగ‌స్టు 24న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మొద‌ల‌వుతుంది. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి బుక్ చేసుకోవాల‌ని సూచించారు.