వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌తో యూజర్లు డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందవచ్చు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.
ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున లేదా తొందరపాటు వల్ల ఏదైనా మెసేజ్ లేదా మీడియాఫైల్‌ను డిలీట్ చేస్తే వాటిని తిరిగి రికవరీ చేసుకునే అవకాశంలేదు. త్వరలో తీసుకురాబోతున్న ఫీచర్‌తో డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా తిరిగి పొందవచ్చు. యూజర్లు మెసేజ్ డిలీట్ చేసిన వెంటనే చాట్ స్క్రీన్ మీద మెసేజ్ డిలీటెడ్ లైన్‌తోపాటు అన్‌డూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అన్‌డూపై క్లిక్ చేస్తే డిలీట్ చేసిన మెసేజ్ తిరిగి చాట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మెసేజ్ డిలీట్ చేసేప్పుడు యూజర్ డిలీట్ ఫర్ మీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అన్‌డూ ఆప్షన్ కనిపించదు. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్‌లకు మాత్రమే అన్‌డూ ఆప్షన్ చూపిస్తుంది.
ఈ ఫీచర్‌తోపాటు హైడ్ ఫోన్ నంబర్ అనే ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో యూజర్లు తమ ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ఆప్షన్‌ను కమ్యూనిటీస్ ఫీచర్‌లో పరిచయం చేయనుంది.