భారత ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 38 ఇంజనీర్ (సివిల్) పోస్టుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పాటు అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుల చివరి తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 30 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా సెప్టెంబర్ 18 నుంచి 25 వరకు వివిధ బ్రాంచుల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.22,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చెక్‌చేసుకోవచ్చు.
ITI LIMITED Network Systems Unit, 16/507, Choupasni Housing Board,Choupasni Main Road, Opp. Suthla, JODHPUR – 342 008. Contact Person: Rajesh Mathur, Contact No.: 9414919706
ITI LIMITED Network Systems Unit, B-1/6, PATEL NAGAR, BIKANER – 334 003 Contact Person: Ashok Tirkey, Contact No.: 9869650857