తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష తప్పదని నిరూపించే ఘటన ఇది. విధి నిర్వహణలో సిఐ, కానిస్టేబుల్ పై పలు అభియోగాలు ఉన్నాయి. ఇక తాజాగా ఆ అభియోగాలు రుజువు అయ్యాయి. దీనితో సిఐ, అలాగే కానిస్టేబుల్ ను సర్వీసు నుండి తొలగిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు…
గతంలో విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ల్ లో సీఐ గా పని చేసిన యు. రామారావు,గాలి వీరేంద్రబాబులపై వచ్చిన ఆరోపణల పై విచారణ జరిపారు. ఇందులో వారిద్దరూ దోషులని తేలటంతో ఇద్దరినీ ఉద్యోగం నుండి తొలగించారు..ప్రస్తుతం సిఐ రామారావు రాజమహేంద్రవరం డిటిసిలో పని చేస్తుండగా కానిస్టేబుల్ వీరేంద్ర విజయవాడ సీసీయస్ లో పని చేస్తున్నాడు..