Alert: పీజీ వైద్య విద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్..చివరి తేదీ ఎప్పుడంటే?

0
105

తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ స్టార్ట్ అయింది. పీజీ వైద్య విద్య సీట్ల భర్తీకి ఆన్​లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనికి సంబంధించి విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నీట్-2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ.. ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విదుదల చేస్తారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు.