డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.
పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. చిత్రబృందం వరుస ప్రమోషన్‌లతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా లైగర్ కు సంబంధించి ఓ వార్త తెగ వైరల్‌గా మారింది.
లైగర్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ విజయ్ కెరీర్ లోనే హైఎస్ట్ గా జరిగింది. ఏకంగా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లైగర్ సినిమాకి జరగడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
వరల్డ్ వైడ్ లైగర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా :
నైజాం : 25 కోట్లు
సీడెడ్ : 9 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.5 కోట్లు
ఈస్ట్ : 5 కోట్లు
వెస్ట్ : 3.8 కోట్లు
గుంటూరు : 5.2 కోట్లు
కృష్ణా : 4.3 కోట్లు
నెల్లూరు : 2.2 కోట్లు
టోటల్ ఆంద్ర తెలంగాణలో లైగర్ సినిమా 62 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కర్ణాటక : 5.20 కోట్లు
తమిళనాడు : 2.5 కోట్లు
కేరళ : 1.20 కోట్లు
నార్త్ ఇండియా : 10 కోట్లు
ఓవర్సీస్ : 7.5 కోట్లు