Breaking News- హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీపికబురు

0
71

హైదరాబాద్ జర్నలిస్టులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ విరమణకు ఒక రోజు ముందు వారికి తీపికబురు అందించారు. ఇళ్ల స్థలాల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న హైదరాబాద్‌ జర్నలిస్టులకు..స్థలాల కేటాయింపు, నిర్మాణాలకు సుప్రీం పచ్చజెండా ఊపింది. 8 వేల నుంచి 50 వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుకున్నట్టు తెలిపారు.

“ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నాం. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండి.” – జస్టిస్​ ఎన్వీ రమణ, సీజేఐ