మహేష్-రాజమౌళి కాంబోలో సినిమా..హీరోయిన్ గా సీతారామం బ్యూటీ?

0
132

కాగా సూపర్ స్టార్ ఇటీవల “సర్కారు వారి పాట” సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక తాజాగా సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించనున్నారు. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుందని టాక్. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తుంది.ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు మహేష్.

తాజాగా మహేష్-రాజమౌళి సినిమా గురించి ఆసక్తికర చర్చ ఇప్పుడు ఫిలిం నగర్లో జరుగుతోంది.ఇటీవలే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంది హిట్ తో పాటు ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ను మహేష్ సినిమా కోసం అనుకుంటున్నారట. ఇటీవలే సీతారామం సినిమాతో ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మహేష్ పక్కన ఈ భామ అయితే సరిగ్గా సూటవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత  అన్నది తెలియాల్సి ఉంది.