రవితేజ ని వదలని ఆ డైరెక్టర్..ముచ్చటగా మూడోసారి..!!

రవితేజ ని వదలని ఆ డైరెక్టర్..ముచ్చటగా మూడోసారి..!!

0
105

కొన్ని కాంబినేషన్స్ ఎన్ని సినిమా లు చేసినా మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలనిపిస్తునే ఉంటాయి.. అలాంటి కాంబినేషన్ లో రవితేజ, గోపిచంద్ మలినేని కాంబో ఒకటి.. వీరి కాంబినేషన్ లో ‘డాన్ శీను’ సూపర్ హిట్ అయ్యింది.. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘బలుపు’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కాగా తాజాగా వీరి కాంబో లో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ‘ఒంగోలు’ ఏరియా లో ‘పోలీస్ ఆఫీసర్’ గా కనిపిస్తారంటా, ఒంగోలు లో జరిగే అక్రమాలని చెరిపే అధికారిగా ఉంటూ అతనికి వచ్చిన అనుకోని ఆపదనుండి ఎలా బయటపడ్డాడో అనే లైన్ లో సాగనుందట. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ సూపర్ హిట్ కొడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.