నేడే ఇండియా- పాక్ మ్యాచ్..భారత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

0
132

ఆసియా కప్​లో భాగంగా నేడు టీమ్​ఇండియా తన తొలి మ్యాచ్​ను పాకిస్థాన్​తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కరోనా బారిన పడ్డారు. దీనితో జట్టు కొంతమేర ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినట్లైంది. అయితే తాజాగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాయి క్రికెట్ వర్గాలు.

కరోనా బారిన పడిన టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్ కొలుకున్నాడని​ తాజా పరీక్షల్లో అతడికి నెగటివ్​ వచ్చినట్లు తెలిసింది. అతడు ఇప్పటికే ఈ ఆసియా కప్​ కోసం దుబాయ్​ కూడా చేరుకుని జట్టులో కలిశాడని వెల్లడించాయి. ప్రాక్టీస్​ సెషన్​కు కూడా హాజరైనట్లు చెప్పాయి.

మరోవైపు రాహుల్ కరోనా బారిన పడడంతో  తాత్కాలిక కోచ్​గా వీవీఎస్​ లక్ష్మణ్​ను ఎంపిక చేశారు. ప్రస్తుతం అతడు జట్టుతోనే ఉన్నాడు. పాక్​తో మ్యాచ్​ ముగిశాక అతడు వెనక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.