టిక్‌టాక్ స్టార్, భాజపా నాయకురాలు సోనాలీ ఫోగాట్(42) అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు శనివారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
“కర్లీస్ బీచ్ షాక్ యజమాని ఎడ్విన్ నూన్స్తో పాటు మరో డ్రగ్ పెడ్లర్ దత్తప్రసాద్ గోయంకర్‌ను అరెస్ట్ చేశాం. దత్తప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్ధరణ అయింది. అతడు హోటల్ గ్రాండ్ లియోనీ రిసార్ట్‌లో రూమ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆమె గదిలో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాం” అని డీసీపీ దల్వి తెలిపారు.
చనిపోవడానికి ముందు సోనాలీ పార్టీకి వెళ్లిన క్లబ్ యజమాని, డ్రగ్ డీలర్ దత్తప్రసాద్ గోయంకర్‌ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. గోయంకర్ నుంచి తాము డ్రగ్స్ తీసుకున్నట్లు సోనాలీ సహాయకులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.