భూమి లాక్కుని..కట్టుబట్టలతో గ్రామం నుండి దళితుని బహిష్కరణ

0
89

అతనో దళితుడు. అతని నుండి ఇల్లు, భూమి సర్వం లాక్కున్నారు. ఊళ్లో నుండి వెల్లగొట్టారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఇదంతా ఊరి దళిత పెద్దలు, అధికార పార్టీ సర్పంచ్, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేనే చేయించడం విడ్డూరం. కాగా బాధితుడు వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం  చింత నెక్కొండకు చెందిన యాకయ్య కాగా..చివరకు మానవ జాతీయ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్బంగా బాధితుడు మాట్లాడుతూ..నాకు న్యాయం జరగాలని 15 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న. అయినా ఎవరు పట్టించుకోవడం లేదని యాకయ్య వాపోయారు. చిన్నప్పటి నుండి దొర దగ్గరనే ఉంటున్నాం. మా ఇద్దరు అన్నదమ్ములం ఆస్తులు పంచుకున్నాం. నాకున్న 20 గుంటల భూమి ఇల్లు లాక్కున్నారు.  ఇదంతా గ్రామ సర్పంచ్ గటిక మహేష్ , ఎమ్మెల్యే కలిసే చేస్తున్నారు. నాకు రూ20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. నాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశా. నాకు న్యాయం చేయకపోతే మా కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం అని హెచ్చరించారు.