ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎత్తు పెరగడం లేదని చింతిస్తున్నారు. తమ పిల్లలు ఎత్తు పెరగలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ తల్లిదండ్రులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు హైట్ పెరగకపోవడం సమస్యతో బాధపడడం మనం గమనిస్తుంటాము.
హైట్ పెరగకపోవడం వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. పోషకాహార లోపం, సరైన జీవనశైలి లేకపోవడం కూడా కారణం అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ ఎలాంటి ఖర్చులేకుండా కొన్ని యోగాసనాలు చేయడం వలన ఎత్తు పెరగడంతో పాటు.. మంచి శరీరాకృతి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ యోగాసానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తడసానా: ఈ యోగా చేయడం చాలా సులభం. ఈ ఆసనం చేయడం వల్ల కండరాలు సాగడంతో పాటు ఎత్తు పెరుగుతారు. ఈ ఆసనాన్ని ఉదయం సమయంలో చేయడం ఉత్తమం. ఈ ఆసనం చేయడం వలన కొన్ని నెలల్లోనే ఎత్తు పెరగడం మొదలవుతుంది.
వృక్షాసనం: ఎత్తు పెంచే ఆసనాలలో వృక్షాసనం కూడా చాలా ముఖ్యమైనది. ఈ ఆసనం ఎత్తును పెంచే హార్మోన్ల అభివృద్ధికి సహాయపడుతుంది.