తిన్నది అరగడానికి ఇదే బెస్ట్ వే..

0
118

ప్రస్తుతకాలంలో చాలామంది తీసుకున్న ఆహారం జీర్ణంకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారు ఈ సమస్య నుండి ఉపశమనం కోసం అనేక డబ్బులు ఖర్చు చేసి వివిధ రకాల మందులు వాడుతుంటారు. కానీ వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజు ఇలా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

కారణాలు ఏంటంటే..ఎక్కువుగా తినడం, సరైన డైట్ ను పాటించకపోవడం వల్ల అరుగుదల సమస్య వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. ఇవి వికారం, నిద్రలేమికి కూడా కారణమయ్యే ప్రమాదం ఉంటుంది.

అందుకే ఇలాంటి వారు తిన్న తర్వాత కొన్ని రకాల ఆసనాలు వేస్తే.. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి.. తిన్నది వెంటనే అరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనం లేదా ఏదైనా తిన్న తర్వాత వజ్రాసనం చేయడం ద్వారా తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత తడాసానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.