మీకు విపరీతంగా చెమట వస్తుందా? అయితే ప్రాణానికే ప్రమాదం..

0
80

సాధారణంగా మనలో చాలామందికి చెమట పట్టి విపరీతమైన దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య చాలామందిని వేధిస్తుంది. కానీ దీనిని నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏందుకో మీరు కూడా ఓ లుక్కేయండి..

ఆత్రుత, ఆందోళన, మానసిక ఒత్తిడి, కారంగా ఉండే ఆహారాలు అధికంగా తినడం ఎక్కువగా చెమట పట్టడానికి కారణాలని నిపుణులు చేబుతున్నారు. శరీరం ఎక్కువగా చెమట పట్టడం ప్రారంభించినప్పుడు అది మధుమేహానికి కూడా కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంటే దీనికి అర్ధం రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపు తప్పిందని, శరీరం నుంచి వివిధ హార్మోన్లు విడుదలవుతాయని వారు చెప్తున్నారు.

శరీరం తగినంత గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేయకపోతే శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి విపరీతంగా చెమట పట్టడం వల్ల బెడ్‌ షీట్లు, బట్టలు కూడా తడిసిపోతాయి. అలాంటి వ్యక్తులు అలసట, చిరాకు వంటి సమస్యలను ఎదుర్కుంటారు. అందుకే వీరు వీలయినంత తొందరగా వైద్యులను సంప్రదించడం మంచిది.