ఏపీలోని నంద్యాల జిల్లాలో 113 మెయిన్ అంగన్‌వాడీ వర్కర్, మినీ వర్కర్, అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీ కానున్నాయి. ఈ మేరకు అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 7వ తరగతి, 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జులై 1, 2022వ తేదీనాటికి దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 35 యేళ్లలోపుండాలి. ఈ అర్హతలతోపాటు సంబంధిత గ్రామంలో నివాసముండే మహిళా అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తికలిగిన అభ్యర్ధులు సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో సెప్టెంబర్ 8, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది.
మెయిన్ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు: 8
మినీ వర్కర్ పోస్టులు: 1
అంగన్‌వాడీ ఆయా పోస్టులు: 104