ఏపీ, తెలంగాణలో పొత్తులపై బీజేపీ నేత క్లారిటీ

0
122
MLA Raja Singh

ఏపీ, తెలంగాణాలో పొత్తులపై ఎంపీ లక్ష్మణ్‌ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో మాత్రం బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎన్డీఏలోకి తెదేపా వస్తోందనేది కేవలం ప్రచారమే. తెలంగాణలో సొంతంగానే అధికారం దక్కించుకుంటాం. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తాం. ఏపీలో జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయి. ఏపీలో జగన్ పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటాం అన్నారు.

కమ్యూనిస్టులను సీఎం కేసీఆర్ సూది, దబ్బనం పార్టీ అంటూ వెక్కిరించినా ఇంకా బుద్ది రాలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బిహార్‌ పర్యటనతో నవ్వుల పాలయ్యారని ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీశ్​ కుమార్ అమాయకుడని తెలిపారు. కేసీఆర్ ఉచ్చులో చిక్కుకుని ఆయన అలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.ని

తీశ్ కుమార్ అసహనంతో చిరాకుతో లేచి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కూసోమని బతిమాలుకున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. గల్వాన్ అమర వీరులకు కేసీఆర్ సాయం చేయడంలో తప్పులేదన్న అయన.. కొండగట్టు ప్రమాద బాధితులకు ఆదుకునేందుకు మనస్సెందుకు రాలేదని ప్రశ్నించారు.