విశ్వాస తీర్మానంలో ఆప్ విజయం..బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

0
93

ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న భాజపా ‘ఆపరేషన్‌ లోటస్’ కార్యక్రమం విఫలమైందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. దిల్లీ అసెంబ్లీలో తన ప్రభుత్వంపై తానే స్వయంగా పెట్టుకున్న విశ్వాస తీర్మానంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కమలనాథుల తీరును సీఎం కేజ్రీవాల్ తప్పుబట్టారు.  జాతీయ స్థాయిలో రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. కరడుగట్టిన నిజాయితీ పార్టీ ఒకటి, అత్యంత అవినీతి పార్టీ మరొకటి అంటూ భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు.