టీమిండియాకు బిగ్ షాక్..టీ20 వరల్ట్‌కప్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్ దూరం!

0
84

టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే ఆసియా కప్ కు దూరమైన ఆల్ రౌండర్ జడేజా టీ20 ప్రపంచకప్‌ కు దూరం కానున్నట్లు తెలుస్తుంది. మోకాలి గాయానికి శస్త్రచికిత్స తర్వాత కనీసం 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని, అందుకే అతను ఆస్ట్రేలియా ఫ్లైట్‌ ఎక్కే అవకాశాలు లేవని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.