ఆ రాష్ట్ర సర్కార్ కు షాక్..3,500 కోట్ల భారీ జరిమానా..ఎందుకో తెలుసా?

0
78

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సర్కారుకు షాక్ తగిలింది. బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ 3,500 కోట్ల జరిమానా విధించింది. “దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఆరోగ్య సంబంధిత సమస్యలను వాయిదా వేయలేం. ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల రాజ్యాంగ బాధ్యత. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిధుల కొరత కోసం ఎదురుచూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలను ఆలస్యం చేయకూడదు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. రెండు నెలల్లోపు రూ.3500కోట్లను బంగాల్‌ ప్రభుత్వం జమ చేయాలి” అని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఏకే గోయెల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.