బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి కన్జర్వేటివ్ పార్టీలో ఎన్నికయ్యేది ఎవరో సోమవారం తేలిపోనుంది. బ్రిటిష్ విదేశాంగశాఖ మంత్రి లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ గెలుపు అవకాశాలు తక్కువేనని సర్వేలు చెబుతున్నాయి.