తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. ఈ నెలలో భారీగా నోటిఫికేషన్లు వస్తాయని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా 23 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.