మీరు ఏదైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..

0
96

మనలో చాలామంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. పచ్చని ప్రకృతి రమణీయతలో పారవశ్యం పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా జలపాతాల వద్ద పర్యాటకుల సందడి అంతా ఇంతా కాదు. మీరు కూడా ప్రకృతి రమణీయతతో అలరారే ఎన్నో టూరిస్ట్ ప్రాంతాలను చుట్టేయాలంటే ఈ ప్రదేశాలను చూడాల్సిందే..

ఊటీ ని చూడడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వర్షాకాలం లో ఈ ప్రదేశం చాలా బాగుంటాయి. అందమైన ప్రకృతి ఎంతగానో ఆకట్టుకుంటుంది. మదుమలై నేషనల్ పార్క్, పైకారా జలపాతాలు ఇలా ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ వున్నాయి. హెక్కింగ్, ట్రెక్కింగ్ ఇలా ఎన్నో వాటికి అనుకూలంగా ఉంటుంది ఈ ప్రదేశం. కనుక సెప్టెంబర్ లో మీరు కూడా ఊటీ వెళ్ళొచ్చేయండి.

కోవలంలో హవా బీచ్ బాగా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒకవైపు సముద్రం, మరొకవైపు పచ్చని భూభాగాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ ప్రాంతం. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఈ ప్రదేశం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హిల్ టౌన్ కాలింపాంగ్‌ టూర్ వేస్తె మరచిపోలేరు. విశాలమైన లోయ ప్రాంతాలు, బౌద్ధ ఆరామాలు, చర్చిలు ఇలా ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ వున్నాయి.