నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి..నీట మునిగిన పంట పొలాలు

0
97

నల్గొండ జిల్లా నెడమనూరు మండలం ముప్పారం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడింది. దీనితో భారీగా వరదనీరు వృధాగా పోతుంది. ఈ వరద ప్రభావానికి ఆయకట్టు దిగువనున్న  పంట పొలాలు నీట మునిగాయి. వెంటనే రైతులు నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీనితో ఎడమ కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. అయితే అర్ధరాత్రి వరకు నీటి ప్రవాహం ఇదే స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పంటలు నీట మునగడంతో రైతులు బోరున విలపిస్తున్నారు.