‘రైతు కానోడికి రైతుబంధు ఎందుకు?..రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే..’

0
82

ప్రజలు కష్టించి సంపాదించిన సొమ్మును కొంత టాక్స్ ల ద్వారా ప్రభుత్వానికి కడుతున్నారు. ఆ డబ్బును రైతుబంధు పేరుతో ప్రభుత్వం రైతులు కాని సంపన్నులకు పుట్నాలు పంచినట్లు పంచుతోంది. పంట పండించే రైతుకు విత్తనాలు ఎరువులు ఫ్రీగా ఇవ్వు పంటకు మద్దతు ధర ఇవ్వు కాని పైసలు ఇవ్వడం ఏమిటి? ఎవ్వరి సొమ్ము ఎవ్వరికీ పంచుతున్నారు.

భూమి బంగారం అయిందని కెసిఆర్ చెపుతున్నారు. 30 లక్షలకు తక్కువ ఎకరం ఎక్కడా లేదని
75% భూమి పంట పండించని సంపన్నుల వద్ద ఉన్నది. వారు కౌలుకు ఇచ్చుకుంటూ కౌలు పైసలతో రైతు బంధు పైసలతో హాయిగా ఉంటున్నారు. సిగ్గు లేకుండా వందల ఎకరాలకు రాజకీయ నాయకులు రైతు బంధు తీసుకుంటున్నారు. భూమి దున్నే రైతుల చేతిలో భూమి లేదు. ఉన్న భూమిని పిల్లల చదువుల కోసం రోగాలు నయం చేసుకొనుట కోసం యేట ఇంత అమ్ముకుంటున్నారు. ఏ రైతైనా పంట పండిస్తే వచ్చే డబ్బుతో ఏకరం భూమి కొనగలిగె పరిస్థితి ఉన్నదా? పంట పండించే రైతుకు పంట పండే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. కేవలం అధికారం నిలబెట్టుకొనుటకు ప్రజల సొమ్మును విచ్చల విడిగా ఖర్చు చేస్తూ ప్రజలను మోసం చేసే వారు ఎన్నటికీ మంచి పాలకులు కాలేరు.

అన్ని రకాల ఉచిత పథకాలు మంచివి కావు. కేవలం విద్య, వైద్యం మాత్రమే ఉచితం చేయాలి కాని ఈ రెండిటినీ మాత్రమే ప్రజలకు అందు బాటులో లేకుండా చేశారు. విద్య వైద్యం కోసం లక్షల్లో, కోట్లలో ఒక్కకొక కుటుంబం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కమిషన్ లు వచ్చే పథకాలు ఓట్లు రాల్చే పథకాలు మాత్రమే ప్రవేశ పెట్టే పాలకులను ప్రభుత్వాలను నమ్మవద్దు. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే సంపన్నులు అవుతున్నారు. వారి ఆస్తులు వేల లక్షల కోట్లకు పరిగెడుతున్నాయి. దోపిడీ దొంగల చేతిలో పాలన పెడితే అభివృద్ధి జరగదు. ప్రజల ఆస్తులు పెద్దగా పెరగడం లేదు. ఉచిత పథకాలు బంధు చేస్తే కరెంటు బిల్లులు, పెట్రోల్, డీజిల్, బస్, ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గుతాయి.

కావున ప్రజలు ఓట్లు వేసే టప్పుడు అప్పుడు ఇచ్చే కాసులకు కక్రుత్తి పడి ఓటు వేస్తే
తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. పన్నుల రూపంలో ఒక్కో కుటుంబం సంవత్సరానికి వేల రూపాయలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.

-నారగొని ప్రవీణ్ కుమార్