లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వారి వేధింపులు తాళలేక చాలా మంది తనువు చాలించారు. ఇక తాజాగా లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. ఈ విషాద ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణ అనే యువకుడు లోన్ యాప్ ద్వారా రూ.8 వేలు తీసుకున్నాడు. ఈ క్రమంలో లోన్ యాప్ సిబ్బంది రూ.20 వేలు కట్టాలని వేధించారు. దీనితో ఆ యవకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.