తిరుమలకు పోటెత్తిన భక్తులు..శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

0
124

తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. దీనితో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని అధికారులు తెలిపారు.

కాగా నిన్న శ్రీవారిని 65,470 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 29,899 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

మరోవైపు అక్టోబర్ 25న సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం ఉండటంతో ఆ రోజు కూడా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసేస్తారు. అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి తెరవనున్నారు.