ఆన్లైన్ లోన్ యాప్స్ పై కేంద్రం ఉక్కుపాదం..మార్గదర్శకాల రూపకల్పన

0
90

లోన్ యాప్స్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. లోన్ లు ఇవ్వడం తిరిగి అధిక వడ్డీ, సకాలంలో చెల్లించలేదని వేధింపులకు పాల్పడుతున్నారు. దీనితో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరి ఆగడాలకు చెక్ పెట్టడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం లోన్​ యాప్​ల పనితీరు, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో చట్టబద్ధమైన లోన్​ యాప్​లు మాత్రమే గూగుల్, యాపిల్​ యాప్ స్టోర్స్​లో ఉండేలా చూసేందుకు మార్గదర్శకాలు రూపొందించింది. దీనితో లైసెన్సు లేకుండా అక్రమ వ్యాపారం చేస్తున్న యాప్ ల పని ఖతం కానుంది.

గత ఏడాది నవంబర్‌లో రిజర్వ్‌ బ్యాంకు లోన్ యాప్ ల అక్రమ వ్యాపారాలను వెల్లడించింది. ఈ తరహా యాప్‌లను చైనా, సింగపూర్‌, ఇండొనేసియాలకు చెందిన విదేశీయులు నడిపిస్తున్నారు. భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నా శాశ్వత ప్రాతిపదికన పటిష్ఠ నియంత్రణ చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.