బ్రిటన్​ రాజుగా 73 ఏళ్ల ఛార్లెస్..పట్టాభిషేకం అప్పుడే!

0
88

బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఎలిజబెత్- 2 మరణంతో బ్రిటన్ లో విషాధచాయలు అలముకున్నాయి.

మరోవైపు తదుపరి రాజు ఎవరనేది ప్రకటించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. వాస్తవానికి రాజు లేదా రాణి కన్నుమూత తర్వాత.. 24 గంటల్లో వారసుడిని ప్రకటించాల్సి ఉంటుంది. కాగా ఆమె పెద్ద కుమారుడు ఛార్లెస్ అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు.  ఒకవేళ రాజుగా ప్రకటన తర్వాత ఛార్లెస్‌.. కింగ్‌ ఛార్లెస్‌-3 పేరుతో, ఆయన భార్య కామిలాను క్వీన్ కాన్సర్ట్‌ పేరుతో వ్యవహరిస్తారు.

అయితే రాజు ప్రకటన తరువాత పట్టాభిషేకానికి మాత్రం.. కొన్ని నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. పట్టాభిషేకానికి అనుసరించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణమని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. 240 కోట్ల జనాభా ఉన్న 56 స్వతంత్ర దేశాల కామన్‌వెల్త్ కూటమికి ఛార్లెస్ నాయకుడు అవుతారు.