సూర్య #42 మూవీ క్రేజీ అప్డేట్..అంచనాలు పెంచేస్తున్న మోషన్ పోస్టర్-Video

0
86

తమిళ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. సింగం సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఈమధ్య ఆకాశం నీ హద్దురా, జై భీం వంటి విభిన్న సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక తాజాగా సూర్య టాప్ డైరెక్టర్ శివతో #42 పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది.

ఈ సినిమా పిరియాడిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కున్నట్టు తెలుస్తోంది. . అంతేకాకుండా త్రీడీలో రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ మూవీలో సూర్య‌కు జోడీగా దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు చిత్రబృందం.

ఈ మూవీకి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు మేక‌ర్స్. మోషన్ పోస్టర్ తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ  సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌తో కలిసి నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను రెండు భాగాలుగా తెర‌కెక్కించే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=SPKfzhJBmzA&feature=emb_title