తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త..చైనా మీటర్లు వస్తున్నాయి: సీఎం కేసీఆర్

0
125

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. కనీసం ఏ రాష్ట్రాలతో సంప్రదించకుండా ఈ బిల్లును తెచ్చారని బీజేపీపై మండిపడ్డారు. ఈ బిల్లు తీసుకురావడంతో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య దూరం మరింత పెరిగిందని సీఎం అన్నారు.

కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రాలు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ సవరణ బిల్లుతో మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు కేసీఆర్. తాను బతికున్నంత కాలం మోటార్లకు మీటర్లను పెట్టనీయబోమన్నారు. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. మీటర్లు కూడా చైనా నుండే వస్తున్నాయి.

మనమందరం కలిసి కేంద్రంపై పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఇచ్చే చాక్లేట్ వద్దని చెప్పాం. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు అమలైతే విద్యుత్ శాఖలో ఉద్యోగాలన్నీ పోతాయి, పేదలకు, రైతులకు అన్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ సంస్కరణ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.