‘సీతారామం’ హీరో సెన్సేషనల్ కామెంట్స్..నేను ఇండస్ట్రీలో ఉండకూడదని..

0
108

ఇటీవల సీతారామంతో సాలిడ్ హిట్ కొట్టాడు మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి తెలుగులోనూ భారీ హిట్ ను సొంతం చేసుకుంది ఈ ప్రేమకథా చిత్రం. లెఫ్టినెంట్ రామ్, సీత పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ హను రాఘవపూడి సక్సెస్ సాధించాడు.

ఇక ఈ సినిమాలో పాటలు కూడా హైలైటే. ముఖ్యంగా హీరోయిన్ మృణాల్ తన నటన, అందంతో ఆకట్టుకుంది. రామ్ రాసిన లేఖను సీతకు అందజేయడానికి రష్మీక, తరుణ్ భాస్కర్ పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి.

ఇదిలా ఉంటే..తాజాగా దుల్కర్ సల్మాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నా కెరీర్ ఆరంభంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. నేను ఇండస్ట్రీకి పనికి రానని, నటన రాదని చాలా నెగెటివ్ రివ్యూస్ రాశారన్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి నేను అవసరం లేదని, నటన కోసం నేను తయారు చేయబడలేదనే వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.