దేశంలో అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. కామాంధుల అఘాయిత్యాలకు మహిళల జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా తెలంగాణ రాజధాని హైద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. పాతబస్తీలోని 16 ఏళ్ల బాలికపై ఓయో లాడ్జ్ లో 2 రోజులపాటు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు యువకులు. మొదట ఆ బాలికను కిడ్నాప్ చేసి మత్తు మందు ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది.