మేమున్నాం అంటున్న శ్రీరామ యూత్ ఫ్రెండ్స్..బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

0
80

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం వెలుమలపల్లి శ్రీరామ యూత్ ఫ్రెండ్స్ వారు ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు బాసటగా నిలిచి మానవత్వం చాటుకుంటున్నారు. తాజాగా వెలుమలపల్లికి చెందిన లక్ష్మయ్య s/ నాగయ్య బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆయన మృతికి ఆర్ధిక ఇబ్బందులు కారణమని తెలుస్తోంది. ఆయన మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉంటే ఆ కుటుంబానికి అండగా మేమున్నామని వెలుమలపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ యూత్ ఫ్రెండ్స్ నిలబడ్డారు. ఆ కుటుంబానికి ఆసరాగా ఆర్ధిక సహాయం రూ.10 వేలు అందజేశారు. కాగా ఇటీవల వెలుమలపల్లికి చెందిన మల్లేష్ గత నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ కుటుంబానికి కూడా శ్రీరామ యూత్ వారు ఆర్ధిక సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటున్న శ్రీరామ యూత్ ను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.