Fact check: ఈ పురుగు కుడితే నిజంగానే చనిపోతారా?..క్లారిటీ

0
144

సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని నిజం కావొచ్చు మరికొన్ని కాకపోవచ్చు. ఇక తాజాగా ఈ ఫోటోలో కనిపిస్తున్న పురుగుకు సంబంధించి ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇది ఆకుపచ్చని పురుగు పత్తి పొలంలో వస్తుంది. ఈ పురుగు పాము కంటే విషమైనది. ఇది కుడితే 5 నిమిషాల్లో చనిపోతారు. కర్ణాటకలో ఈ పురుగు కుట్టడం వల్ల ముగ్గురు రైతులు చనిపోయారు అంటూ ఓ న్యూస్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జోరందుకుంది.

అయితే ఇదంతా నిజం కాదని, రైతులు భయపడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఇది పత్తి చేనులో ఉండదని, చెరుకు, పండ్ల తోటల్లో ఉంటుందని కృషి విజ్ఞాన కేంద్రం తెలిపింది. ఈ పురుగు కుట్టడం వల్ల దురద, మంట మాత్రమే వుంటాయని చనిపోయేంత ప్రమాదం ఉండదని వెల్లడించింది. ఈ పోస్ట్ వాట్సాప్ యూనివర్సిటీ క్రియేషన్ అని స్పష్టంగా అర్ధమైనట్లు సమాచారం.

ఈ విషయం తెలియని ప్రజలు వాట్సప్ గ్రూపుల్లో ఈ పోస్టును షేర్ చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్ట్ చూసిన వారంతా ఇది నిజమని నమ్ముతూ భయపడుతున్నారు. ఇది ఫేక్ న్యూస్, భయపడాల్సిన అవసరం లేదు.

కాబట్టి ఈ విషయాన్ని అందరికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం: రైతులు